Saturday, June 20, 2009

నేను.......................

నా పేరు శ్రీధర్. మా ఇంటి పేరు సురభి. మా చుట్టాలు బంధువులు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో స్థిర నివాసంఏర్పరచుకొని ఉన్నారు. మా తాతగార్లు రోజు పుట్టలేదు కాబట్టి ఏమో, లేక జనాభా తక్కువ ఉండటంవల్లనో కోస్తా, నైజాం అని చూసుకోకుండా వాళ్ళ అమ్మాయిలను అబ్బాయిలను ప్రాంతీయ భేధాలు పట్టించుకోకుండా పెళ్ళిళ్ళు చేసారు.
మా నాన్న గారు సొంతూరుగా చెప్పుకునే ఊరు - పొనుగోడు(గరిడెపల్లి మండలం, నల్గొండ జిల్లా). మా అమ్మ పుట్టిందిపెరిగింది నందిగామ(నందిగామ మండలం, క్రిష్ణా జిల్లా). నేను పుట్టింది నందిగామలోనే, ఇక పోతే పెరిగింది నిజామాబాద్జిల్లాలో; ఉద్యోగరీత్యా నాన్నగారు నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, పెద్ద కొడపుగల్, తాడ్వాయి, కామారెడ్డి (స్థిరనివాసం) మరియు అటుపిమ్మట మరెన్నో చోట్ల పని చేస్తూ ఉద్యోగ విరమణకు దెగ్గరలో ఉండి కామారెడ్డిలో స్థిరపడ్డారు. దురద్రుష్టవశాత్తు నేను నరకం అనదగ్గ అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో దినసరి కూలిగా పని చేస్తున్నాను. (అమ్మానాన్నలకు సేవ చేయక మనము మన అనదగ్గ వాళ్ళకు దూరంగా ఉంటే అదే నిజమయిన నరకం) అమెరికా - భూతా() స్వర్గం;
ఆనాడు అనుకొన్నాను నేను కూడా, ఏనాడైనా మీరు అనుకున్నట్టుగా, కాకపోతే అడుగు పెట్టింతరువాత తెలిసింది --- దూరపు కొండలు నున్నగా ఎందుకు ఉంటాయి అని ఎందుకు అంటారో.
అదండి నా గురించి నా ఉపోధ్గాతం అవును ఎక్కడికో వెళ్తూ ఉన్నాను, కదా క్షమించాలి - ఎందుకంటే క్షమార్హుడినికావున..................................................

ఏమి చేయాలి(ఏదయినా చేయాలి): - నేనేమో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. దురదృష్టవశాస్తు మంత్రాలు కూడా నేర్చుకోలేకపోయాను. కనీసం సంధ్యావందనం అయినా రాకుండా పోయింది. సంధ్యావందనం నేను(బ్రాహ్మణుదిని) చేయవలసింది; నాకొరకు కాదు; నా లోకం కొరకు అని తెలిసినతరువాత మరింతగా నేను లోకానికి నాకు చేతనయింది నేను చేయాలి అనే సంకల్పం మరింతగా పెరుగుతూనే ఉంది. నేను ఏదో సంపాదించుకొని, దానిలో కొంత నేను చేయాల్సిన పనికి కేటాయిద్దామనుకుంటే, నేను సంపాదించుకునేది నావరకే సరిపోతు నా బతుకుబండిని నేను నడిపించుకుంటున్నాను. బ్రాహ్మణుడిగా పుట్టినందులకు నేను యాచన చేయటం తప్పుకాదు. ఒక మంచిపనికోసం ఎవరు యాచన చేసిన తప్పులేదు; యాచన నేనే చేస్తే మంచిపని నేనే చేసాను అనే సంతృప్తి నాకునుదక్కుత్తుంది. నేను నేరుగా చెప్పలేనేమే అనే నా అనుమానం. నీ బ్రతుకు నువ్వు చూసుకో చాలు అని అనే నా వాళ్ళునాకు ఉన్నారు. కాబట్టి ఏది ఏమయినా సరే; ఒకసారి అడుక్కుంటే తప్పులేదు, పోయేదేమిలేదు. అయినా నా వాళ్ళు, ముఖ్యంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను అర్దం చేసుకుంటారనే అనుకుంటున్నాను.
దానాలలో ఒక మహా దానం విద్యాదానం. రోజు ప్రతీ అర్ధికి, విద్యను అభ్యసించుటకొరకు ధనం మూలం అయి ఉంది. అందుకని ధనం లేని విధ్యార్ధుల కొరకు నేను ఒక ట్రస్టు కామారెడ్డి కేంద్రంగా, నా మిత్రుల అండదండలతో కామారెడ్డివాసూలను భాగస్వాములను చేసి భీద విద్యార్దులకు తోడుగా ఉండటానికై స్థాపిస్తే బాగుంటుంది అనే ఆలోచనమీ ముందుకు తీసుక వచ్చాను.
ముందుగా నా మిత్రులు నా ఆలోచనకు రూపం కల్పిస్తారని ఆశిస్తున్నాను......

ఇంకా ఉంది - మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను.
మీ భవధీయుడు.
శ్రీధర్ సురభి.

1 comment:

  1. మరోలా అనుకోకపోతే ఒకాఛిన్నమాట. నీలో నాకొక సాఫ్ట్వేర్ పార్వతీశం కనిపిస్తున్నాడోయ్. అపార్ధం చేసుకోకు. ఆయన కూడా నీలానే విదేశాలకి వెళ్ళినా తల్లిదండ్రులను, ఆచారవ్యవహారాలలోనూ గౌరవం కలిగి ప్రవర్తించాడు.

    ReplyDelete