Sunday, May 31, 2009

ఇఎడి, గ్రీన్ కార్డ్, సిటిజన్ ....................

నా మిత్రుడొకరు చెప్పారు; ఇఎడి, గ్రీన్ కార్డ్, సిటిజన్ కాని అమెరికాలో ఉన్న విదేశీయులకు కనుక వస్తే అమెరికా ప్రభుత్వం కూడా అట్టి వ్యక్తిని ఏమి చేయలేవు అతను/ఆమె అమెరికాలో చావకుండా (చావుకూడా దరిచేరదు అన్నట్టుగా మాట్లాడాడు లెండి.) చావుని దరిచేయనీకుండా హాయిగా చిరంజీవిగా(చావులేనివాడిలా మరియు మన తెలుగు సినీ హీరో లా సుఖంగా బ్రతకవచ్చు అని) బ్రతకవచ్చు అని చెప్పాడు.
(నేను వ్రాసిన విషయంలో కాస్త అతిశయోక్తి యున్నను ...... అర్దం చేసుకుని ఉంటారు కదూ).
దయచేసి చివరి నిమిషంలో అయినా మనవాళ్ళ దెగ్గరే ఉండేట్లు మన భవిష్యత్తును ఊహించుకుందాం.. మన జీవిత గమ్యాన్ని సరిచేసుకుందాం.

నా ఈ ఆర్టికల్ నా ఆ ఆప్తమిత్రుడికి అంకితమిస్తు..................
మురళీకృష్ణకు ఈ విధమయిన శిక్షను రాసి పెట్టిన ఆ పై వాడిని బండ బూతులు తిట్టుకుంటూ.. అదే పైవాడిని ఈ మురళి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ................

మీ శ్రీధర్.

Sunday, May 24, 2009

ఈనాటి ఈ దారిద్ర్యం..............................

మన పెద్దలు మనకు ఇచ్చిన గొప్ప ఆస్థి - మనము పాటించాల్సిన పద్దతులు. శుచి శుభ్రతకు మనకంటూ కొన్నిపద్దతులు ఉన్నాయి.
౧) ఉదాహరణకు
మలమూత్రాదుల కార్యక్రమం పిమ్మట మనము కాళ్ళు కడుగుకొని ఇంట్లోకివస్తాము.
అయితే రోజు చాలా వరకు కాళ్ళు కడుగుకోవటం లేదని నా అభిప్రాయం మరియు రోజు మనవాళ్ళు(మనతోటివాళ్ళు చాలామంది) దొడ్లోనే కాళ్ళు తుడుచుకొనే పట్టాలు(గుడ్డలు) పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవటం మంచిదికాదు. కాకపోతే
నాకును నచ్చక పోయినా(స్వతంత్రంగా ఉండాలి అంటే ఉండలేక) నాలుగేళ్ళనుంచి నేనును అందరు పాటించే పాడు పద్దతులు పాటించాల్సి వస్తుంది.
మా పోయిన (పోయినోలందరు మంచోళ్ళు - ఉన్నోల్లందరు పాపులు(పాపి చిరాయువు)) మామయ్య చెప్పెవాడు - నిల్చుని మూత్రం చేసుకుంటుంటుడగా మా తాత గారు (ఆయన పోయారు) చూస్తే (చూసి) వెనకగా వచ్చి తన్నేవారని.
నిల్చుని మూత్రం చేసుకుంటే వద్దని అనుకున్నా కాకూడని జరగకూడని తప్పు జరుగుతుంది. నావరకు జరగదు నాకుపర్లేదు అనుకుంటే అది స్వ్యెన్ ప్లూ కన్నా పెద్ద మాయరోగం (ఇలా అందరికి సంబందించిన విషయం - నా వరకు అనిఅనుకుంటే - అంతకు మించిన మాయరోగం మరొకటి ఉండదు).
నోట్: అనువుకాని చోట కాకపోయిన - అనువయిన చోట చేస్తే కొంతలో కొంత మంచి చేసిన వాళ్ళము అవుతాము. వీలయితే మీ ఇంట్లో (అమెరికాలో నివసించే మన ఆంధ్రులు) మీ రెస్ట్ రూమ్ పట్టాలు తీసేసి
రెస్ట్ రూమ్ ముందు బయటవేసుకుని కాలక్రుత్యాదుల పిమ్మట కాళ్ళు కడుగుకొని - తుడుచుకొని ఇంట్లో అడుగు పెట్టండి (కనీసం దొడ్డి ముందుఉన్న కాళ్ళ పట్టా అయినా తీసేసుకోండి)
) రోజే నాకు మరో విషయం తట్టింది - అదేటంటే మన కుర్రకారు(ఆడ&మగ) కొద్దిగా సమయం దొరికిందంటే మంచం ఎక్కేస్తున్నారు (నిద్రలోకి జారుకుంటుంన్నారు). నిద్ర పోవాలి కాని ఎంతయితే పని చేస్తే; పనికి సరిసమానమయిన విలువ కలిగిన నిద్ర మాత్రమే పోవాలి. (దరిద్రుడికి మాత్రమే ఆకలి ఎక్కువ - నిద్ర ఎక్కువ) పని చేసేవాళ్ళు పనికివచ్చే పనులను పదే పదే చేయచ్చు. పనికిమాలిన పనులను మానుకున్న వారికి కలిగే నష్టం ఏమిలేదు. రాత్రి పగలు అనే తేడాలను తప్పనిసరిగా పాటించాలి. పరాయివాళ్ళకు పనిచేసేప్పుడు సమయం సందర్భం పాటిస్తున్నాము, కాని మనకోసం మనం చేసే పని సమయం సందర్భం మనము పాటించటం లేదు. మనము ఎవరికోసమయితే పని చేస్తున్నామే వాళ్ళు పయికొస్తున్నారు. నానాటికి మన బ్రతుకు నాశనం అవుతుంది. (ఉదా: ఐటి. రంగ ఉద్యోగులు). నాకు తెలిసి నేను - రేపటి పౌరులకు ( రోజు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన వారికి - ఈనాటి అనుభవాన్ని రేపటి కొరకు నిక్షిప్తం చేసుకో - రేపటి రోజున వినియోగించుకో అని చెప్పి యున్నాను.) ఈనాటి నీ అమూల్యమయిన సమయం; కాలక్షేపం కోసం మాత్రమే కాకుండా కాలానుగుణంగా అభివ్తుధ్ధి కొరకై వినియోగించుకో అంటాను.
సర్వేజనా సుఖినో భవంతు.

మీ భవధీయుడు - సురభి.