Saturday, June 20, 2009

పని.... నిద్ర

ప్రపంచంలో ఏ దేశంలో చూసినా పని చేయడం పగలే వెలుతురు ఉండగానే చేసుకుంటారు. పని ఎక్కువ అయితే చేయాల్సిన అవసరం ఉంటేనే రాత్రి కూడా చేస్తారు.
అలాగే రాత్రి పని ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి నిద్రించేది రాత్రి సమయంలోనే... పగలు పనిని వదిలేసి పరుండడు. రాత్రి నిద్ర పోయే సమయంలో పని ఉన్నా నిద్రను మాత్రం ఆపలేడు. రాత్రి సమయంలో పని చేస్తే పగలు పది మంది పని చేస్తుంటే; ఈ మహా మనిషి నిద్రపోతాడు. పనికిమాలిన వాడయితాడు.
మనం భారతీయులం మనదేశంలో పగలు రాత్రి పని చేస్తున్నారు. పక్క దేశాలకు వెళ్ళి వాల్లకోసం (వాళ్ళను ధనవంతులను చేయుటకు) పగలు పనిచేస్తున్నాము. అంతే కాకుండా రాత్రి మన పనులకోసం లేచి ఉంటున్నాము.
ఏ పని చేసే సమయంలో ఆ పనే చేయాలి. వాటిని క్రమం తప్పిస్తే శిక్ష పడుతుంది (దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది -ఆరోగ్యం చెడిపోవటం అనేది శిక్ష అనే నా భావన).
ఈవిధంగా చేయటం వల్ల మనకు మన దేశానికి మనం చేస్తున్న మేలు ఏంటో మనకే(మీకే తెలియాలి).

-------------సర్వేజనా సుఖినో భవంతు
--------------
మీ భవధీయుడు
శ్రీదర్ సురభి.

2 comments:

  1. then,y do u come to US n work jus to make US ppl rich?? Dont be so hypocrite by saying that...r u not becoming rich by workig here...if u cant work in odd hours jus go back to ur village and do cultivation...jus stop this bullshit

    ReplyDelete
  2. మిమ్మల్ని మీరు అన్వయించుకుని తదనుగునంగా మీ పని-నిద్ర కార్యక్రమాన్ని సరిచేసుకుంటారని నా ఈ బుల్లి షీట్(వివరణ).

    ReplyDelete