Friday, January 23, 2009

బాబోయ్ ధరలు

మద్యం ధర పెంచి ప్రభుత్వం మద్యం త్రాగే వారిపయిన మాత్రమే భారం పెంచింది అని నా అభిప్రాయం. - నాలాంటి సాధారణ మనిషిపయిన భారమేమి మోపలేదు. ఈ విషయం ఒక విధంగా సంతోషకర వార్త.
మద్యం పుచ్చుకునేవాళ్ళు(వాడు/అది) ప్రతీ ఇంట్లో ఉండరు. పుచ్చుకునేవాళ్ళు రోజు పుచ్చుకుని (పుచ్చిపోరు) తిండి తినక రోజులు గడపరు. కాబట్టి మాత్రమే కాదు ౪౦ పెంచుకున్న పర్లేదు. (....................................)

మాకు కావల్సింది రోజు మేము తినే ఆహార ధాన్యాల ధరల తగ్గింపు.

Thursday, January 15, 2009

పెళ్ళి - ౨౦౦౯

అమెరికా అబ్బాయి - వద్దు వద్దు; కంప్యూటర్ ఇంజనీర్ (ఇండియా లో) - వద్దు బాబోయ్ వద్దు
ఇంటిపట్టున గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే - ఎంతో ముద్దు

Tuesday, January 13, 2009

మనిషి అంటే - మాటమీద నిలబడనివాడు


శ్రీకర్ రెడ్డి, ప్రసన్న, రవీందర్ -లకు నా హ్రుదయపూర్వక అభినందనలు.

మీ ఆలోచన బాగుంది. ఆంధ్రజ్యోతి-లో మీ వెబ్ సైట్ గురించి చూసాను.
(www.myresolutions09.com)

నా మిత్రులు నాకు చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే - "ముఖ్యంగా మనిషికి ఈ రోజు చెడు పని చేయక పోతే సమాజంలోవిలువ లేదు".నా ఉదాహరణ - నాకు మధుపానం అలవాటు కావాలి అని ప్రయత్నించారు నా మిత్రులు. ఆ ఒక్క చెడు అలవాటు అయినాఉంటే సమాజంలోని వాళ్ళతో కలుస్తానని. నా దురద్రుష్టమేమో నాకు అలవాటు కాలేదు, కావటం లేదు. సమాజంలో చాలా సార్లు నేను ఒంటరి వాడినయ్యాను. (పనికి మాలిన వాడిని కూడా అయ్యాను)
కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే "మరి ఇలాంటి దురలవాట్లను కూడా మాననటువంటి మన మహనీయులు మారుతారని ఆశించగలమా; అనేది నా అనుమానము".

ఏది ఏమయినను మీ మంచి మనసువల్ల ఒక్కరయినా మారుతారని ఆశిద్దాం.


మీ శ్రేయోభిలాషి
శ్రీధర్.

క్రాంతి - సంక్రాంతి (శుభాకాంక్షలు)

భోగి మంటలు - రంగవల్లులు
రధం ముగ్గులు - గొబ్బిళ్ల పాటలు
మంగళ స్నానాలు - మామిడాకు తోరణాలు
గంగిరెద్దు మేళాలు - హరిదాసు కీర్తనలు
నిండు ధాన్యం తో గాదెలు - నోరూరె గారెలు
డబ్బాల్నిండా అరిసెలు (నేతి) - కకరలాడె సకినాలు
కోడి పందాలు; వచ్చే డబ్బులు - పోయే రాజ్యాలు
అలా అలా - ఇలా ఇలా...............

సంక్రాంతి మీ ఇంట నవ్వుల క్రాంతి విలసిల్లాలని ఆశిస్తూ

మీకు మీ శ్రేయోభిలాషులకు ఇవే మా మకర సంక్రాంతి శుభాకాంక్షలు...

---------మీ శ్రీధరుడు

Monday, January 12, 2009

వినండి - నేర్చుకోండి

బురద (తప్పు పని) లో కాలు వేయకురా అని పెద్దలు చెప్తారు - కాలు వేసి, జారి, కింద పడి, నడ్డి విరిగి హా తప్పు చేసానే అని అనుకోకండి.

Monday, January 5, 2009

విమర్శ

ఎదుటి వారిని (దుర్)విమర్శించు ముందు - నేను అర్హుడినా అని నీవు నిన్ను ఒక్కసారి ప్రశ్నించుకో.....
(మనము చేయు విమర్శ - స్వీకరించే వారిని అర్దం చేసుకోని
విమర్శించు)

టెక్నాలజి వల్ల జరిగిన లాభమా ఇది?

చిన్న గాయమే అయినా - అదీ గాయమే కదా!!!

















(నేను మనిషినే తప్పులు చేస్తాను - కాక పోతే నా తప్పు నన్నుదహించాలి; పక్కన ఉన్న వారిని కాదు.)

అమెరికా లో మన వారి నీతి సూత్రాలు.........

) నీవు తిన్న కంచము(ప్లేటు)నీవే కడుక్కో ------
(మిగతా గిన్నెలతో నీకు సంభందము లేదు - మిగతా గిన్నలగురించి పట్టించుకోరు లేండి).

Saturday, January 3, 2009

నా దారి రహదారి

నీవు చేసే పని నీకు మంచి అనిపించినట్లయితె - ఎవరేమి అన్నను ఆ పనిని మానకు