Tuesday, June 16, 2009

మనిషి................

యంత్రం:
తయారు చేసింది మనమే... పనిచేయిస్తుంది మనమే
చెప్పినట్టుగా వింటుంది... చెప్పినట్టుగా చేస్తుంది.

జంతువు:
మనలాగే తయారు చేసాడు పైవాడు..... మనకోసమే మాటనివ్వలేదు ఆ పైవాడు
కొన్నిమనం చెప్పినవి వినకపోయినను... మరికొన్ని అయినా మనకోసమో మరివాటికొరకో మనం
చెప్పినట్టుగా వింటాయి....చెప్పినట్టుగా చేస్తాయి.

మనిషి:
చెప్పినట్టుగా వినడు... చెప్పినట్టుగా చేయడు
తోచిందే చేస్తాడు.... (దేనికోసమో) తొందరపడతాడు..
తింటాడు తొంగుంటాడు... ఏమి చేస్తున్నానో అని ఆలోచిస్తాడు..
ఏదో చేసానని అనుకుంటాడు... ఏమిచేయలేదని తెలుసుకుంటాడు
ఏదో చేద్దామనుకుంటాడు... మళ్ళి తింటాడు తొంగుంటాడు.

మనిషి తయారుచేసిన యంత్రం పనిచేస్తుంది... మనిషి చెప్పినమాట వినే జంతువు పని చేస్తుంది....
మనిషి తనకు తాను తన కోసం తన మనసుకు చెప్పుకున్న మాటనే వినలేక..
యంత్రంకన్నా పశువుకన్నా ... హీనంగా - హీనాతి హీనంగా బ్రతుకు బండిని ఈడుస్తున్నాడు.

నిన్న గడిచొపోయింది... నేడు గడిచిపోతుంది
గడిచిపోయిన నిన్నటిని అనుభవంగా తీసుకో
నిన్న నీవు సృష్టించిన యంత్రంను ఆదర్శంగా తీసుకో
నీ మాట వినే జంతువుని చూసి నైజాన్ని నేర్చుకో
రాబోవు 'రేపు'ను నేడే ఆదర్శంగా మలుచుకో....

మిత్రులు కోరికలు కాంక్షించాలని కోరుకుంటు...

మీ భవధీయుడు
శ్రీధర్ సురభి.


No comments:

Post a Comment