Wednesday, February 25, 2009

ఇదేనా ప్రజాస్వామ్యం!!!!








ప్రజాస్వామ్యంలో ఇదేనా ప్రజల ఆస్తులకు రక్షణ!!!
ప్రజాస్వామ్యంలో ప్రజల ఆస్తులకు ఇదేనా ప్రజలిచ్చే విలువ!!!

Tuesday, February 3, 2009

భయం భయం భయం - ఎందుకు ఈ భయం!!!!!!!!!!!౧

ప్రతీ దానికీ మనం భయపడాలా - అవసరం లేదు అని నేను అంటాను. ప్రతీ దానికి భయపడేట్లయితే ఏ పని చెయ్యనూలేము అనునది నా భావన.
ఏదయినా పని చేసేప్పుడు ఆ పని వల్ల ఒనగూరే లాభ నష్టాలు చూసుకో, మంచి చెడు ఆలోచించు, చేసే పని గూర్చి తెలుసుకుని ఆ పనిని సక్రమంగా నిర్వర్తించు.
ఉదాహరణకు: కొందరు పచ్చడి తింటే ఆరోగ్యం పాడవుతుంది అనే భావనతో ఉంటారు. పచ్చడి మెతుకులు తిని బ్రతికే మనుషులు మన మధ్య ఆరోగ్యంగా ఉండటం లేదా? - వాళ్ళేనండి కాయకష్టం పని చేసేవాళ్ళు.
అయినా నేను ఇంతకు ముందు అన్నట్టుగా ప్రతీ పనికీ ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి పని చేయునప్పుడు ప్రతిచర్యను కూడా తెలుసుకుంటే మన(మనిషి) జీవితం సుఖంగా సాగి పోతుంది.
మనం పుట్టక మునుపు కాని, మనపుట్టుకతో కాని భయం పుట్టలేదు. మనమే భయాన్ని మనలో పుట్టించుకున్నాము. పుట్టినది అన్నాను - ఏది ఏమయ్యిననూ పుట్టినది గిట్టక మానదు. గిట్టక మాననప్పుడు తుంచుటలో తప్పులేదు. కనీసం పెంచి పోషించక పోవచ్చుకూడా.
అన్ని విషయాలలో భయం అక్కరలేదు - భయాన్ని పోగొట్టుకో - పరులను భయపెట్టటం మానుకో......

మీ శ్రేయోభిలాషి
సురభి.


Sunday, February 1, 2009

తినుభంఢారంబుల్ - చెడు అనునది మన భ్రమయేమో!!!!


(ఈనాడు ౧-౨-౨౦౦౯ నుంచి సంగ్రహించిన వార్త)
మనం
తినే ఆహారపు అలవాట్లకు మన వాళ్ళు ఎన్ణో ఆంక్షలువిదించుకుని సరి అయిన ఆహారం తీసుకోవటం లేదు అనినేను భావిస్తాను. నా అనుభవంలో "కొందరు నూనె కనుకతీసుకుంటే కొలెస్త్రాల్ శాతం పెరుగుతుందని ఆరోగ్యానికి హానిఅని, మరి కొందరు అన్నం తింటే మధుమేహం వ్యాధి వచ్చేఅవకాశం ఉంది అని, ....." ఆహారపు అలవాట్లను పూర్తిగామార్చుకుంటున్నారు. మన ఆహారపు అలవాట్లను మన అభిరుచులకు అనుగునంగా మార్చుకుంటే చాలామంచిది అనినేను భావిస్తాను. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మధుమేహం వ్యాధినే తీసుకుంటే కాకరకాయ, మెంతికూర ఎక్కువగాతీసుకుంటే మనము వ్యాధి రాకుండా నిరోధించవచ్చు. ప్రారంభంలోనే అదుపులో పెట్టవచ్చు, మళ్ళీ దరిచేరకుండాచేయనూవచ్చు.
మనకు మన పెద్దవాళ్ళు అందించిన అలవాట్లను మనము మార్చనక్కర అవసరం రాక పోవచ్చు. మన పెద్దల మాట - బంగారం కన్నా విలువయినది, భవిష్యత్తులో పనికి వచ్చేది. (పూర్వీకులు అయాచితంగా మనకు అందించిన వరాలుఆయుర్వేదం, యునాని వంటివి మనము ఉపయోగించుకోవచ్చు).
మనము తినే ఆహారం గడ్డి కన్నా విలువయినది కాదు. అని మనము గడ్డి తిననూ లేము, తినునది విసర్జింపలేము. చివరకు తినునది పద్దతి ప్రకారం తింటే - ఆరోగ్యంగా ఉంటాము.
ఒకనాడు చెడు అనుకున్నది రోజు మంచి కావచ్చు. మంచి అనునది చెడు ఏనాడును అవ్వదు.

As well - Best Practices are always good to follow. Try to avoid debating about best practices.

మీ భవధీయుడు
సురభి.