Tuesday, June 30, 2009

భోజనం చేయు పద్దతి.............

పడకగదిలో పక్కమీద కూర్చొని తినటం - చదువుకున్నముండమోపి గాడిదలు మాత్రమే చేయు పద్దతి

Saturday, June 20, 2009

నేను.......................

నా పేరు శ్రీధర్. మా ఇంటి పేరు సురభి. మా చుట్టాలు బంధువులు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో స్థిర నివాసంఏర్పరచుకొని ఉన్నారు. మా తాతగార్లు రోజు పుట్టలేదు కాబట్టి ఏమో, లేక జనాభా తక్కువ ఉండటంవల్లనో కోస్తా, నైజాం అని చూసుకోకుండా వాళ్ళ అమ్మాయిలను అబ్బాయిలను ప్రాంతీయ భేధాలు పట్టించుకోకుండా పెళ్ళిళ్ళు చేసారు.
మా నాన్న గారు సొంతూరుగా చెప్పుకునే ఊరు - పొనుగోడు(గరిడెపల్లి మండలం, నల్గొండ జిల్లా). మా అమ్మ పుట్టిందిపెరిగింది నందిగామ(నందిగామ మండలం, క్రిష్ణా జిల్లా). నేను పుట్టింది నందిగామలోనే, ఇక పోతే పెరిగింది నిజామాబాద్జిల్లాలో; ఉద్యోగరీత్యా నాన్నగారు నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, పెద్ద కొడపుగల్, తాడ్వాయి, కామారెడ్డి (స్థిరనివాసం) మరియు అటుపిమ్మట మరెన్నో చోట్ల పని చేస్తూ ఉద్యోగ విరమణకు దెగ్గరలో ఉండి కామారెడ్డిలో స్థిరపడ్డారు. దురద్రుష్టవశాత్తు నేను నరకం అనదగ్గ అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో దినసరి కూలిగా పని చేస్తున్నాను. (అమ్మానాన్నలకు సేవ చేయక మనము మన అనదగ్గ వాళ్ళకు దూరంగా ఉంటే అదే నిజమయిన నరకం) అమెరికా - భూతా() స్వర్గం;
ఆనాడు అనుకొన్నాను నేను కూడా, ఏనాడైనా మీరు అనుకున్నట్టుగా, కాకపోతే అడుగు పెట్టింతరువాత తెలిసింది --- దూరపు కొండలు నున్నగా ఎందుకు ఉంటాయి అని ఎందుకు అంటారో.
అదండి నా గురించి నా ఉపోధ్గాతం అవును ఎక్కడికో వెళ్తూ ఉన్నాను, కదా క్షమించాలి - ఎందుకంటే క్షమార్హుడినికావున..................................................

ఏమి చేయాలి(ఏదయినా చేయాలి): - నేనేమో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. దురదృష్టవశాస్తు మంత్రాలు కూడా నేర్చుకోలేకపోయాను. కనీసం సంధ్యావందనం అయినా రాకుండా పోయింది. సంధ్యావందనం నేను(బ్రాహ్మణుదిని) చేయవలసింది; నాకొరకు కాదు; నా లోకం కొరకు అని తెలిసినతరువాత మరింతగా నేను లోకానికి నాకు చేతనయింది నేను చేయాలి అనే సంకల్పం మరింతగా పెరుగుతూనే ఉంది. నేను ఏదో సంపాదించుకొని, దానిలో కొంత నేను చేయాల్సిన పనికి కేటాయిద్దామనుకుంటే, నేను సంపాదించుకునేది నావరకే సరిపోతు నా బతుకుబండిని నేను నడిపించుకుంటున్నాను. బ్రాహ్మణుడిగా పుట్టినందులకు నేను యాచన చేయటం తప్పుకాదు. ఒక మంచిపనికోసం ఎవరు యాచన చేసిన తప్పులేదు; యాచన నేనే చేస్తే మంచిపని నేనే చేసాను అనే సంతృప్తి నాకునుదక్కుత్తుంది. నేను నేరుగా చెప్పలేనేమే అనే నా అనుమానం. నీ బ్రతుకు నువ్వు చూసుకో చాలు అని అనే నా వాళ్ళునాకు ఉన్నారు. కాబట్టి ఏది ఏమయినా సరే; ఒకసారి అడుక్కుంటే తప్పులేదు, పోయేదేమిలేదు. అయినా నా వాళ్ళు, ముఖ్యంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు నన్ను అర్దం చేసుకుంటారనే అనుకుంటున్నాను.
దానాలలో ఒక మహా దానం విద్యాదానం. రోజు ప్రతీ అర్ధికి, విద్యను అభ్యసించుటకొరకు ధనం మూలం అయి ఉంది. అందుకని ధనం లేని విధ్యార్ధుల కొరకు నేను ఒక ట్రస్టు కామారెడ్డి కేంద్రంగా, నా మిత్రుల అండదండలతో కామారెడ్డివాసూలను భాగస్వాములను చేసి భీద విద్యార్దులకు తోడుగా ఉండటానికై స్థాపిస్తే బాగుంటుంది అనే ఆలోచనమీ ముందుకు తీసుక వచ్చాను.
ముందుగా నా మిత్రులు నా ఆలోచనకు రూపం కల్పిస్తారని ఆశిస్తున్నాను......

ఇంకా ఉంది - మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను.
మీ భవధీయుడు.
శ్రీధర్ సురభి.

పని.... నిద్ర

ప్రపంచంలో ఏ దేశంలో చూసినా పని చేయడం పగలే వెలుతురు ఉండగానే చేసుకుంటారు. పని ఎక్కువ అయితే చేయాల్సిన అవసరం ఉంటేనే రాత్రి కూడా చేస్తారు.
అలాగే రాత్రి పని ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి నిద్రించేది రాత్రి సమయంలోనే... పగలు పనిని వదిలేసి పరుండడు. రాత్రి నిద్ర పోయే సమయంలో పని ఉన్నా నిద్రను మాత్రం ఆపలేడు. రాత్రి సమయంలో పని చేస్తే పగలు పది మంది పని చేస్తుంటే; ఈ మహా మనిషి నిద్రపోతాడు. పనికిమాలిన వాడయితాడు.
మనం భారతీయులం మనదేశంలో పగలు రాత్రి పని చేస్తున్నారు. పక్క దేశాలకు వెళ్ళి వాల్లకోసం (వాళ్ళను ధనవంతులను చేయుటకు) పగలు పనిచేస్తున్నాము. అంతే కాకుండా రాత్రి మన పనులకోసం లేచి ఉంటున్నాము.
ఏ పని చేసే సమయంలో ఆ పనే చేయాలి. వాటిని క్రమం తప్పిస్తే శిక్ష పడుతుంది (దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది -ఆరోగ్యం చెడిపోవటం అనేది శిక్ష అనే నా భావన).
ఈవిధంగా చేయటం వల్ల మనకు మన దేశానికి మనం చేస్తున్న మేలు ఏంటో మనకే(మీకే తెలియాలి).

-------------సర్వేజనా సుఖినో భవంతు
--------------
మీ భవధీయుడు
శ్రీదర్ సురభి.

Tuesday, June 16, 2009

మనిషి................

యంత్రం:
తయారు చేసింది మనమే... పనిచేయిస్తుంది మనమే
చెప్పినట్టుగా వింటుంది... చెప్పినట్టుగా చేస్తుంది.

జంతువు:
మనలాగే తయారు చేసాడు పైవాడు..... మనకోసమే మాటనివ్వలేదు ఆ పైవాడు
కొన్నిమనం చెప్పినవి వినకపోయినను... మరికొన్ని అయినా మనకోసమో మరివాటికొరకో మనం
చెప్పినట్టుగా వింటాయి....చెప్పినట్టుగా చేస్తాయి.

మనిషి:
చెప్పినట్టుగా వినడు... చెప్పినట్టుగా చేయడు
తోచిందే చేస్తాడు.... (దేనికోసమో) తొందరపడతాడు..
తింటాడు తొంగుంటాడు... ఏమి చేస్తున్నానో అని ఆలోచిస్తాడు..
ఏదో చేసానని అనుకుంటాడు... ఏమిచేయలేదని తెలుసుకుంటాడు
ఏదో చేద్దామనుకుంటాడు... మళ్ళి తింటాడు తొంగుంటాడు.

మనిషి తయారుచేసిన యంత్రం పనిచేస్తుంది... మనిషి చెప్పినమాట వినే జంతువు పని చేస్తుంది....
మనిషి తనకు తాను తన కోసం తన మనసుకు చెప్పుకున్న మాటనే వినలేక..
యంత్రంకన్నా పశువుకన్నా ... హీనంగా - హీనాతి హీనంగా బ్రతుకు బండిని ఈడుస్తున్నాడు.

నిన్న గడిచొపోయింది... నేడు గడిచిపోతుంది
గడిచిపోయిన నిన్నటిని అనుభవంగా తీసుకో
నిన్న నీవు సృష్టించిన యంత్రంను ఆదర్శంగా తీసుకో
నీ మాట వినే జంతువుని చూసి నైజాన్ని నేర్చుకో
రాబోవు 'రేపు'ను నేడే ఆదర్శంగా మలుచుకో....

మిత్రులు కోరికలు కాంక్షించాలని కోరుకుంటు...

మీ భవధీయుడు
శ్రీధర్ సురభి.


Tuesday, June 9, 2009

మిధ్య అయిన విధ్య.

మన రాష్ర్టం నుంచి వెళ్ళి రాష్ర్టపతి అయ్యి దేశవ్యాప్త ఉపాధ్యాయ దినోత్సవం జరిపించుకుంటున్న నీలం సంజీవరెడ్డి ఎంతఫీజు కట్టి కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్నారు; కార్పొరేట్ కళాశాలలో చదువుకున్నారు. నిన్న మొన్నటి ఆదర్శరాష్ర్టపతి మరియు ..స్. అధికారులు, .పి.స్. అధికారులు ఎక్కడ చదువుకున్నారు.

రావాలి మనలో మార్పు - తేవాలి మన సమాజంలో మార్పు. కార్పొరేట్ సంస్థల్లోని పాఠశాలలు & కళాశాలలు భోధించేవిధ్య ప్రతి విధ్యార్ధికి ఆవశ్యమయితే మన ప్రభుత్వాలు నడిపించే పాఠశాలలు & కళాశాలల్లో అవే భోదనాంశాలు ఎందుకనిలేవు, తేడాలెందుకు.

మన తాహతు మించి మనము చదివించాలా - అవసరమా; అవసరమే అయితే అడుక్కుని డబ్బుసంపాదించుకోవాలిమన కడుపు మాడ్చుకుని (కడుపుమాడ్చుకుంటే - చివరకు చచ్చిఊరుకుంటాము) మన పిల్లలనుఅనాధలుగా(అందుబాటులో ఉన్న ఫీజులతో హాస్టల్లలో(అనాధ శరణాలయంలో పిల్లాడి గురించి అయితే పట్టించుకునేనాధుడే ఉండడు - హాస్టల్లలో పట్టించుకున్న పట్టించుకోనట్టే)) చేస్తున్నాము.

తల్లితండ్రులు ఆలోచించాలి మీరు.......................................

మీ భవధీయుడు
శ్రీధర్.

Sunday, June 7, 2009

సహకరించలేరా!!!!!!!!!!!!!! (.........సంహరించగలరా)

సహకరించండి లేదా మాచావుకు మేమే భాధ్యులము అని రాసి ఇచ్చి, మీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండండి. మా చావును మీరు నిర్ణయించకండి.
మా ప్రభుత్వమా ఇట్టి మా భారతీయుల ఫోటోలను ప్రతీ దిన పత్రికలల్లో ప్రచురించండి.
(ఆయుధం ఉంటేనే చంపగలిగేవారు తీవ్రవాదులు - ఆయుధం లేకున్నను చంపగలిగేవారు ఇలాంటి ప్రభుధ్ధులు - అలాంటి వారిని ఆయుధంతో చంపినా తప్పులేదు).

మీ మంచికోరే
మీ శ్రీధర్.

Tuesday, June 2, 2009

అమ్మే అతి........... :)

పాలలో పంచదార - కూరలో ఉప్పు
-------అబ్బో లేకపోతే రాదు రుచి
పంచదార, ఉప్పు వాటి పాల్లలో వాటిని ఉంచక, కలుపుతూ పోతు ఉంటే రుచి పాడవుతుంది; వెగటుకూడా పుడుతుంది.

నేను మొన్న ఈ మధ్యనే ఈత నేర్చుకున్నాను. త్వరగా నేర్చుకోవాలని రెండు రోజులు వరసపెట్టి పొద్దుట సాయంత్రం వెళ్ళాను. అంతే వాంతులే వాంతులు. అప్పుడు మళ్ళి అనుకున్నాను ఏదయినను అతి పనికి రాదని.
మన భారత జట్టు సభ్యులు ఐ.పి.ఎల్. అంటూ పనికివమాలిన మ్యాచ్-లు ఆడుతూ ప్రపంచంలోని మిగతా జట్ల కన్నా మాములు మ్యాచ్-లతో సహా అతిగా ఆడుతూ వచ్చింది......... అలసిపోయింది.........ఓడుతూ వస్తుంది. మిగిలిన మ్యాచ్-లో అయినా గెలుస్తుందో చూడాలి. నా ఉద్దేశం ప్రకారం మన బిసిసిఐ-దే వ్వూహత్మక తప్పిందందంగా తోస్తుంది.

దేనికయినా క్రమశిక్షణ అనేది ఉండాలి.