Tuesday, February 3, 2009

భయం భయం భయం - ఎందుకు ఈ భయం!!!!!!!!!!!౧

ప్రతీ దానికీ మనం భయపడాలా - అవసరం లేదు అని నేను అంటాను. ప్రతీ దానికి భయపడేట్లయితే ఏ పని చెయ్యనూలేము అనునది నా భావన.
ఏదయినా పని చేసేప్పుడు ఆ పని వల్ల ఒనగూరే లాభ నష్టాలు చూసుకో, మంచి చెడు ఆలోచించు, చేసే పని గూర్చి తెలుసుకుని ఆ పనిని సక్రమంగా నిర్వర్తించు.
ఉదాహరణకు: కొందరు పచ్చడి తింటే ఆరోగ్యం పాడవుతుంది అనే భావనతో ఉంటారు. పచ్చడి మెతుకులు తిని బ్రతికే మనుషులు మన మధ్య ఆరోగ్యంగా ఉండటం లేదా? - వాళ్ళేనండి కాయకష్టం పని చేసేవాళ్ళు.
అయినా నేను ఇంతకు ముందు అన్నట్టుగా ప్రతీ పనికీ ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి పని చేయునప్పుడు ప్రతిచర్యను కూడా తెలుసుకుంటే మన(మనిషి) జీవితం సుఖంగా సాగి పోతుంది.
మనం పుట్టక మునుపు కాని, మనపుట్టుకతో కాని భయం పుట్టలేదు. మనమే భయాన్ని మనలో పుట్టించుకున్నాము. పుట్టినది అన్నాను - ఏది ఏమయ్యిననూ పుట్టినది గిట్టక మానదు. గిట్టక మాననప్పుడు తుంచుటలో తప్పులేదు. కనీసం పెంచి పోషించక పోవచ్చుకూడా.
అన్ని విషయాలలో భయం అక్కరలేదు - భయాన్ని పోగొట్టుకో - పరులను భయపెట్టటం మానుకో......

మీ శ్రేయోభిలాషి
సురభి.


No comments:

Post a Comment