Tuesday, January 13, 2009

మనిషి అంటే - మాటమీద నిలబడనివాడు


శ్రీకర్ రెడ్డి, ప్రసన్న, రవీందర్ -లకు నా హ్రుదయపూర్వక అభినందనలు.

మీ ఆలోచన బాగుంది. ఆంధ్రజ్యోతి-లో మీ వెబ్ సైట్ గురించి చూసాను.
(www.myresolutions09.com)

నా మిత్రులు నాకు చెప్పిన గొప్ప సత్యం ఏమిటంటే - "ముఖ్యంగా మనిషికి ఈ రోజు చెడు పని చేయక పోతే సమాజంలోవిలువ లేదు".నా ఉదాహరణ - నాకు మధుపానం అలవాటు కావాలి అని ప్రయత్నించారు నా మిత్రులు. ఆ ఒక్క చెడు అలవాటు అయినాఉంటే సమాజంలోని వాళ్ళతో కలుస్తానని. నా దురద్రుష్టమేమో నాకు అలవాటు కాలేదు, కావటం లేదు. సమాజంలో చాలా సార్లు నేను ఒంటరి వాడినయ్యాను. (పనికి మాలిన వాడిని కూడా అయ్యాను)
కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే "మరి ఇలాంటి దురలవాట్లను కూడా మాననటువంటి మన మహనీయులు మారుతారని ఆశించగలమా; అనేది నా అనుమానము".

ఏది ఏమయినను మీ మంచి మనసువల్ల ఒక్కరయినా మారుతారని ఆశిద్దాం.


మీ శ్రేయోభిలాషి
శ్రీధర్.

No comments:

Post a Comment